ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13-09-2022) – Eenadu

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13-09-2022)
– డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్


శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి  సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.  అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య  హృదయం చదవాలి. 

ప్రారంభించబోయే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది.  స్థిరాస్తి  కొనుగోలు వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది.

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని  పెంచుతుంది. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

మనోబలంతో  చేసే పనులు సఫలం అవుతాయి. తోటి వారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. దుర్గాధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో  విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.

అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సమయపాలనతో  పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

తోటి వారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మేలైన ఫలితాలు వస్తాయి.

బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. మీ పేరు ప్రతిష్టలుపెరుగుతాయి. మనఃస్సౌఖ్యం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
 
ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. రామనామాన్నిస్మరించండి.

శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.  
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
[email protected]
For Marketing enquiries Contact :
040 – 23318181
eMail: [email protected]
© 1999 – 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.
ABC

source

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*