Telugu News

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు – Interesting discussion on AP Politics – News18 తెలుగు

ఎన్నారై అయినా ఒకే.. లేక చంద్రబాబు లోకేష్ అయినా రెడీ..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Tension: తిరుపతిలో భయం భయం.. చీకటి పడితే చాలు బయటకు రావాలంటే వణుకే..
Mega Plan: మోదీ ప్లాన్ వర్కౌట్ అవుతోందా..? చిరంజీవి వ్యాఖ్యలకు కారణం అదేనా..?
CM Jagan: సరికొత్త ఎన్నికల నినాదాన్ని తెరపైకి తెచ్చిన సీఎం జగన్.. వర్కౌట్ అయ్యేనా..?
M Bala Krishna, News18, Hyderabad

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలుంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ గుండెల్లో గుబులు పుట్టించాలంటే ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి మళ్లీ వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టే యోచనలో తాను లేనని ఇప్పటికే పవన్ స్పష్టం చేశారు. 2024కి అధే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని పవన్ ఫిక్సయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయానికి పవన్ చరిష్మా ఎంతగానో ఉపయోగపడింది. కొన్ని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పాలనలో కొన్ని వ్యతిరేక నిర్ణయాల అమలుపై విభేదించిన పవన్… టీడీపీతో పొత్తుకు గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగి తన పార్టీ ఓటింగ్ శాంతాన్ని పెంచుకురున్నారు పవన్.

మరోవైపు ఏపీలో ఒంటరిగా వెళ్తే లాభం లేదని భావించిన బీజేపీ.. పవన్ తో జతకట్టింది. పొత్తు కుదిరిన అనంతరం రెండు పార్టీలు పరస్పర అంగీకరంతో కార్యాచరణలు రూపొందించుకుంటున్నాయి. ఐతే ఎన్నికల వరకు పొత్తును కొనసాగించేది మాత్రం సందిగ్ధంలో పడింది. బీజేపీ అయితే పవన్ తో కలిసే ఎన్నికలకు వెళ్తామని తరచూ స్పష్టం చేస్తోంది. అంతెందుకు కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించేందుకు కూడా సిద్ధమవడం జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది.

ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నందున అలాంటి ఓట్లను చీలనివ్వకుండా చూడాలన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. పవన్ కామెంట్స్ తో టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఐతే జనసేనతో పొత్తుకు టీడీపీ తలుపులు తెరిచినా.. పవన్ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తు ద్వారా ప్రభుత్వ అధికార పార్టీని గద్దె దింపే ఆస్కారం ఉందని రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ పొత్తు కోసం జనసేన, బీజేపీలకు పరోక్షంగా సంకేతాలిస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమంటూ మూడు పార్టీల పొత్తుకు పెట్టుకోబోతున్నాయా అనే చర్చకు పవన్ తీస్తే… బీజేపీ వ్యూహం మరోలా ఉంది. జనసేనతోనే కలసి వెళ్తామని చెప్తున్న కమలనాథులు టీడీపీతో పొత్తుకు మాత్రం నై నై అంటుంది. జనసేన అధినేత పవన్ ను తమ వెంటే ఉండేలా చేసుకుంటోంది. టీడీపీవైపు వెళ్తే.. అధికారం తమకు దక్కదని ఉన్న ఓట్లు కూడా కోల్పోయి వైసీపీ గెలుస్తుందేమోనని బీజేపీ ఆలోచిస్తోంది. అందుకే పవన్ చేజారి పోకుండా.. ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటించి జనసేనాని టీడీపీ వైపు వెళ్లకుండా ఫీల్డింగ్ సెట్ చేయాలని భావిస్తోంది. అలాగే పవన్ చెప్పినట్లు 2024 ఎన్నికల రూట్ మ్యాప్ కూడా రెడీ చేసి రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరి ఎన్నికల నాటికి పోరు వన్ టు వన్ ఉంటుందా.. లేదా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Bjp-janasena, TDP

పేటీఎం వాడే వారికి శుభవార్త.. ఇక ఫోన్‌పే, గూగుల్ పే‌కు డబ్బులు పంపొచ్చు!
Rasi phalalu: ఈ రాశుల వారికి ఈరోజు పుష్కలంగా డబ్బు చేతికి వస్తుంది
Numerology today:ఈ తేదీల్లో పుట్టిన వారు ఈరోజు వివాదాల జోలికి పోకపోవడం మంచిది
LIVE TV
NETWORK 18 SITES

source

Related Posts

1 of 226

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *