"కాంతార" చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న తెలుగు సినీ ప్రేక్షకులు, మొదటి రోజును మించి 900 శాతం పెరిగిన కలక్షన్స్ – Industryhit Telugu

“కాంతార” చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న తెలుగు సినీ ప్రేక్షకులు, మొదటి రోజును మించి 900 శాతం పెరిగిన కలక్షన్స్
తెలుగులో రెండో రోజు 11.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన కాంతార
‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం “కాంతార”. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది.
మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది.ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం అవ్వడం అనేది అరుదైన విషయం.”కాంతార” చిత్రం రిలీజైన పదిహేడవ రోజు కూడా 900 శాతం కలక్షన్స్ పెరగడం అనేది “కాంతార” చిత్రం విజయానికి నిదర్శనం.
కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టింది “కాంతార’ చిత్రం.
థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది.
ముఖ్యంగా ఈ “కాంతార” క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి.అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా అంతకు మించిన విజయఢంకాను మోగిస్తుంది.


source

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*