యనమలకు జగన్ షాక్… ఏపీ సర్వీసుల నుంచి అల్లుడుకి రిలీవ్ – News18 తెలుగు

Mega Plan: మోదీ ప్లాన్ వర్కౌట్ అవుతోందా..? చిరంజీవి వ్యాఖ్యలకు కారణం అదేనా..?
CM Jagan: సరికొత్త ఎన్నికల నినాదాన్ని తెరపైకి తెచ్చిన సీఎం జగన్.. వర్కౌట్ అయ్యేనా..?
Notification Cancel: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
ఈ పిల్లలు ప్రత్యేకం… సమాజంలో  కల్మషం దరిచేరని నిర్మల హృదయులు
టీడీపీ సీనియర్ నేత..మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడును రాష్ట్ర సర్వీసుల నుండి రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యనమల అల్లుడు,  ఐఆర్ఎస్ అధికారి అయిన సీహెచ్ వెంకట గోపీనాథ్ డిప్యుటేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. గోపీనాధ్ కోరిక మేరకు ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ 26 వరకూ డిప్యూటేషన్ ఉన్నప్పటికీ గోపీనాథ్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

వెంకట గోపీనాధ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. అయితే గోపినాథ్ అప్పట్లో అవినీతికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎపీఎంఎస్ ఐడీసీ) మేనేజింగ్ డైరక్టర్ గా గోపినాథ్ పనిచేశారు. ఈ సంస్థ ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన సర్జికల్ ఎక్విప్ మెంట్ కొనుగోలుతోపాటు భవనాల నిర్వహణ వంటి బాధ్యతలు చూస్తుంది. ఈ కొనుగోళ్ల వ్యవహారం వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఎపీఎంఎస్ఐడీసీ ఎండీ నల్లగొండకు చెందిన ఓ వ్యక్తికి ఫేవర్ చేయాలని గోపినాథ్ నిర్ణయించుకున్నారు. ఆయనకు హైదరాబాద్ సచివాలయానికి కూతవేటు దూరంలో ఓ కార్యాలయం ఉంది. నిబంధనల ప్రకారం లేక పోయినా ఆయనకు టెండర్ ఇవ్వటానికి గోపినాథ్ రెడీ అయిపోయారని  ఆ శాఖ వర్గాల సమాచారం.

అందుకు ఫ్రతిఫలంగా యనమల అల్లుడికి ఈ సంస్థ ప్రతినిధి ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారని ఎపీఎంఎస్ఐడీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గోపీనాధ్ భార్య దివ్య తన ల్యాండ్ రోవర్ కారును నల్లగొండలో రిజిస్టర్ చేయించారు. ఫ్యాన్సీ నెంబర్ కోసం అయినా నల్లగొండలో రిజిస్టర్ చేయించాల్సిన అవసరం ఏముంది?. డమ్మీ అడ్రస్ పెట్టి నల్లగొండలో కారు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు. దీంతో ఇది ఖచ్చితంగా అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారనే అనుమానాలు అప్పట్లో తలెత్తాయి, చావలి దివ్య కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ కారు ధర 55 నుంచి 65 లక్షల రూపాయల వరకూ ఉంటుంది.

ఏదీఏమైనా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీకీ డిప్యుటేషన్ పైన వచ్చిన కేంద్ర సర్వీసు అధికారులు..ఇప్పుడు తిరిగి కేంద్రానికి వెళ్లిపోతున్నారు. తాజాగా.. ఇదే కేడర్ కు చెందిన జాస్తి కిషోర్ పైన రాష్ట్ర ప్రభత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అంతకు ముందు ఏపీ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన వెంకయ్య చౌదరిని రిలీవ్ విషయంలో వివాదం చోటు చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Yanamala Rama Krishnudu

Megastar Chiranjeevi: చిరంజీవి కెరీర్‌‌ను మార్చేసిన టాప్ సినిమాలు ఇవే..
Kidney Disease: దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి అసలే కారణం అదే.. తేల్చిన తాజా అధ్యయనం
Adah Sharma: నడుమందాలతో అదరహో అనిపిస్తోన్న అదా శర్మ.. అందాల ఆరబోతలో డోస్ పెంచిన భామ..
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *