[email protected] Years : అనుష్క శెట్టి@17 ఇయర్స్ ఇండస్ట్రీ.. 'సూపర్' నుంచి 'నిశ్శబ్ధం' వరకు దేవసేన నట ప్రస్థానం.. – News18 తెలుగు

అనుష్క శెట్టి (Anushka Shetty) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో నటనతో కూడా ఆకట్టుకున్న అందాల తార. అనుష్క డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. అనుష్క ఈ మధ్య సినిమాల్లో నటించడం పూర్తిగా తగ్గించేశారు. తాజాగా ఈమె హీరోయిన్‌గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో 17 యేళ్లు పూర్తి చేసుకుంది. (Instagram/Photo)
17 యేళ్ల క్రితం నాగార్జున హీరోగా దర్వకత్వంలో తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో తెరంగేట్రం చేసారు. తొలి సినిమాలో సాషా’ పాత్రలో ఈమెవరు ఇంత అందంగా ఉంది అనే రీతిలో ప్రేక్షకులతో సూపర్ అనిపించుకుంది. Photo Twitter
కెరీర్‌ మొదట్లో కాస్త గ్లామర్ ఎక్కువ ఉన్న రోల్స్ చేసినా నెమ్మది నెమ్మదిగా ఆమెకు కథా ప్రధాన్యమున్న సినిమాలు వచ్చాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో, మల్లెమాల నిర్మాణంలో వచ్చిన అరుంధతి సినిమా ఆమె సినీ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. ఈ సినిమా సక్సెస్‌తో అనుష్క శెట్టి.. జేజమ్మగా సెటిలైంది.  (Twitter/Photo)
దీంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఈమెకు హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు.  (Twitter/Photo)
ఆ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా నటిగా మారింది అనుష్క. ఇక అది అలా ఉంటే.. అనుష్క శెట్టి నవంబర్ 7న మంగళూరులో జన్మించారు.  (Twitter/Photo)
విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తులు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు." width="1280" height="1280" /> ఇక అనుష్క పర్సనల్ విషయాలకు వస్తే.. మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తులు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు.  (Twitter/Photo)
అనుష్క సరసన దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్‌  (Bahubali series) తర్వాత ‘భాగమతి ‘(Bhaagamathie), నిశ్శబ్దం’, వంటి సినిమాలను చేశారు. ఈ సినిమాల తర్వాత ఆమె ఓ సినిమాకు ఓకే చెప్పిన దానికి సంబంధించి అధికారికంగా ప్రకటించలేదు. (Twitter/Photo)
మరోవైపు ఆమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎంతో మంది సిద్ధంగా ఉన్నా కూడ ఆమె సైన్ చెయ్యట్లేదు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమాను ఒప్పుకున్నా ఇంకా ప్రకటించలేదు. ఇందులో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కీలక పాత్ర చేస్తోంది. (twitter/Photo)
అంతేకాదు ఇన్నాళ్లకు ఆమె నవీన్‌తో ఓ సినిమాను ఓకే చేసిందని టాక్ వచ్చింది. కథ కూడా సిద్ధంగా ఉందని.. ఈ సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించారు.  ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. (twitter/Photo)
మొత్తంగా ఇన్నేళ్ల కెరీర్‌లో అనుష్క శెట్టి.. హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక పాత్రలతో మెప్పించారు. ఈమె నటిస్తుందంటే ఆ పాత్రకు ఏదో ప్రత్యేకత ఉంటుందనే టాక్ ప్రేక్షకుల్లో వెళ్లింది. ఇక అనుష్క శెట్టి భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరుకుంందాం. (Twitter/Photo)










LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *