AP Farmers Day: నేడు ఏపీ రైతు దినోత్సవం.. అన్నదాతలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలివే..! – News18 తెలుగు

10th Exam Fees: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫీజు గడువు ఎప్పటి వరకు అంటే..
Janasena: నెంబర్ 2 సహా.. అందరి కోరిక అదే.. మరి అధినేత పవన్ వారి నిర్ణయాన్ని గౌరవిస్తారా..?
Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ మిస్సింగ్ అంటూ ఫిర్యాదు.. పోయిందా లేక పడేశారా..
డియర్ సీఎం మీ మేలు జన్మలో మరువం.. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దంపతులు.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం జూలై 8న రైతు దినోత్సవంగా (AP Farmers Day) జరుపుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇటు వైసీపీ ప్లీనరీ.. ఇటు రైతు దినోత్సవం పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్ధాయిలో, ఆర్బీకేలలో రైతు దినోత్సవం వేడుకలు.. రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, జిల్లా వనరుల కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యవసాయ అనుబంధ శాఖలపై ఎగ్జిబిషన్‌ స్టాళ్ళు ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలపై ప్రచారం చేస్తోంది. 1. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌, 2. రైతు భరోసా కేంద్రాలు, 3. వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు, 4. ఇన్‌పుట్‌ సబ్సిడీ, 5. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, 6. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం వంటి పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లోనే ఆయా పథకాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తోంది.

ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పథకాల కింద నేటి వరకు రైతులకు రూ.1,27,633.08 కోట్లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు, రూ. 2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి, ఆక్వా రైతులకు ప్రస్తుతం ఉన్న 5 ఎకరాల విద్యుత్‌ సబ్సిడీ పరిమితిని 10 ఎకరాలకు పెంచి యూనిట్‌ రూ. 1.50 కే అందిస్తున్న ప్రభుత్వం.., వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, ఉచిత విద్యుత్‌ సబ్సిడీతో పాటు నాణ్యత పెంచేందుకు విద్యుత్‌ ఫీడర్లు ఏర్పాటు చేసినట్లు వివరించింది.

అనుభవజ్ఞులైన లక్షమంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్రస్ధాయిలో వ్యవసాయ సలహా మండళ్ళు ఏర్పాటు చేశామని తెలిపింది. ఆర్బీకేలకు అనుసంధానంగా అమూల్‌ భాగస్వామ్యంతో పాలసేకరణ కేంద్రాలు, అమూల్‌ ద్వారా గతంలో కంటే అదనంగా లీటర్‌కు రూ. 5 నుండి రూ. 15 వరకు పాడిరైతులు అదనంగా అందుకుంటున్న సర్కార్ తెలిపింది.


ఇక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా, వారి కుటుంబాలకు అండగా రూ. 7 లక్షల ఆర్ధిక సాయం చేస్తున్నామని.., వైఎస్సార్‌ జలకళ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించి, మోటర్లు కూడా ఉచితంగా అందించి రైతన్న సాగునీటి కలను నిజం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government

సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ బిజినెస్ తో నెలకు రూ.40 వేల ఆదాయం..
Balakrishna – Veera Simha Reddy: బాలయ్యతో కోలీవుడ్ స్టార్ హీరో.. వైరల్ అవుతున్న పిక్..
PM Kisan: ఆ రైతులు వెంటనే పీఎం కిసాన్ డబ్బును తిరిగి ఇచ్చేయాలి.. అకౌంట్ నంబర్లు ఇవే..
LIVE TV
NETWORK 18 SITES

source

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*