AP Land Rates: ఏపీలో పెరిగిన భూముల ధరలు.. కొత్త జిల్లాల తర్వాత సర్కార్ నిర్ణయం – News18 తెలుగు

Vizag Special: వైజాగ్ ను ఈ యాంగిల్ లో ఎప్పుడైనా చూశారా..? వావ్ అనకుండా ఉండలేరు..!
చంద్రబాబు బంట్రోతు పవన్ అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. నిజాయితీ ఉందా అని జనసేన ప్రశ్న
వీర విధేయులు.. మాజీ మంత్రులకు ఊహించని షాక్.. వారిని తప్పించడానికి కారణాలు ఇవే..?
ఆ జిల్లాను వెంటాడుతున్న వర్గపోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఫైట్.. సజ్జల దగ్గర పంచాయితీ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 4వ తేదీ నుంచి 26 జిల్లాలతో పాలన ప్రారంభమైంది. ఐతే జిల్లాల అవతరణ కార్యక్రమం పూర్తైన కొన్నిగంటల్లోనే రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రాల్లో భూముల విలువలు (AP Land Rates) పెంచింది. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 11 కొత్త జిల్లా కేంద్రాల్లో భూముల మార్కెట్ విలువలు పెరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశముండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో 20 నుంచి 40 శాతం మేర పెంచింది.

తిరుపతి జిల్లా రేణిగుంటలో అత్యధికంగా 432 శాతం మేర విలువ పెరిగింది. పెరిగిన భూముల విలువలు ఈనెల 6వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్టీఆర్ జిల్లా రాకతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో 15శాతం వరకు విలువలు పెరగనున్నాయి. ఆలాగే తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 20-25శాతం ధరలు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

గుంటూరు జిల్లా నుంచి విడిపోయిన నరసరావుపేట, బాపట్ల జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 1 నుంచే ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచింది. ఇటు తెనాలి పరిధిలోనూ భూముల విలువలు పెరిగాయి. కర్నూలు జిల్లా నుంచి ప్రత్యేకంగా ఏర్పడ్డ నంద్యాల జిల్లా కేంద్రంలో 25శాతం, సమీంలోని గ్రామాల్లో 35శాతం మేర పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

జిల్లాల వారిగా భూముల ధరలు పెరిగే ప్రాంతాలను చూస్తే.. అనకాపల్లిలో 76 ప్రాంతాలు, పార్వతీపురంలో 11 ప్రాంతాలు, తూర్పుగోదావరిలో 15 ప్రాంతాలు, కోనసీమలో 7 ప్రాంతాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 30 ప్రాంతాలు, ఎన్టీఆర్ జిల్లాలో 19 ప్రాంతాలు, తిరుపతిలో 60 ప్రాంతాలు, నంద్యాలలో 27 ప్రాంతాలు, అన్నమయ్య జిల్లాలో 5 ప్రాంతాలు, శ్రీ సత్యసాయిలో 7 ప్రాంతాల్లో భూముల విలువలు పెరిగాయి.

తాజా పెంపుతో తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఏకంగా 432 శాతం పెంచారు. ఇక్కడ ఎకరం రూ.7.52 లక్షలు ఉండగా.. తాజా పెంపుతో అధి రూ.40 లక్షలకు చేరనుంది. అలాగే ఎర్రగుంట పరిధిలో 455 శాతం పెరగనుంది. రూ.9.01 లక్షలున్న ఎకరం భూమి ధర.. రూ.50 లక్షలకు చేరనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆయా ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి.

ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువలు పెంచాలని ప్రభుత్వం ఎప్పటినుంచో భావిస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచే భూముల విలువలు పెంచాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి భూముల విలువలు పెంచుతారన్న ప్రచారం జరిగినా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts, Land registration

100 ఏళ్లు పూర్తి చేసుకున్న బ్యాంక్.. కస్టమర్లకు అదిరే గిఫ్ట్!
Today Unlucky rashi : అన్ లక్కీ రాశులు..ఈరోజు ప్రమాదం జరిగే అవకాశం!
Tiruchanoor: తిరుచానూరుకు చేరిన లక్ష్మీకాసులహారం.. వైభవంగా అమ్మవారి వసంతోత్సవం..
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *