Breaking: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా.. కారణం ఏంటంటే..? – News18 తెలుగు

Vijayawada: కార్తీక మాస దీపారాధన, అరటి డొప్ప దీపారాధన ఎందుకు చేస్తారంటే?
Shocking: పాడు పనులు చేస్తున్నా పట్టించుకోరు..! ఎక్కడో తెలుసా?
Nara Lokesh: ఓడించడానికి జగన్ అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు..
దొండకాయ సాగుతో లాభాలు , ఎకరాకు ₹150,000 వరకు ఆదాయం
Breaking: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు ఓ వైపు హాట్ హాట్ సాగుతున్నాయి. వికేంద్రీ కరణ బిల్లుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ప్రకటన కూడా చేస్తున్నారు. టీడీపీ (TDP) సభ్యుల ఆందోళనలతో తొలి రోజు వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు అంతకుముందు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి (Kona Raghupati) రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitaram) కు ఇచ్చారు. తమ్మినేని ఆ రాజీనామాను ఆమోదించారు. అయితే ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మరో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల సామాజిక సమీకరణాల కారణంగా కోన రఘుపతిని రాజీనామా చేయాలని సీఎం జగన్ కోరినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఎందుకంటే ఇటీవల మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొన్ని పదవుల్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నారు. ఇటీవలే ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించారు. చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డిని తొలగించి ప్రసాదరాజును నియమించారు. సామాజిక సమీకరణాలతో కోన రఘుపతిని తప్పించి కోలగట్ల వీరభద్రస్వామికి చాన్సిస్తున్నారు.. అందుకే కోన రఘుపతి రాజీనామా చేశారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో సమాజిక సమీకరణాలపై సీఎం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కోన రఘుపతిని తొలగించి ఆ స్థానాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. గత మంత్రి వర్గ విస్తరణ సమయంలో మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావును మంత్రిగా తొలగించారు. అయితే కేబినెట్ లో మాత్రం ఆ సామాజిక వర్గానికి బెర్త్ ఇవ్వలేదు. ఈ కారణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనుకున్నారు. అందుకే మంత్రి పదవి ఆశించిన కోలగట్ల వీరభద్ర స్వామికి ఈ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే కోన రఘుపతితో రాజీనామా చేయించినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి మూడున్నరేళ్ల వరకూ ఉన్నారు. వచ్చే ఏడాదిన్నర వరకూ ఆ పదవిలో కోలగట్ల వీరభద్రస్వామి ఉండే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : టీడీపీ సభ్యుల సస్పెండ్.. ఇన్ సైడ్ ట్రేడింగ్ పై సభలో దుమారం.. తెరపైకి టాలీవుడ్ పెద్దల పేర్లు
ఇక కోలగల్ల వీరభద్ర స్వామి విషయానికి వస్తే.. పార్టీలో సీనియర్ నేత.. వైఎస్ఆర్‌సీపీలో తొలి నుంచి కొనసాగుతూ వస్తున్నారు. ఆయనకు తొలిమంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ వైశ్య సామాజికవర్గం కోటాలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆ పదవి కేటాయించారు.
ఇదీ చదవండి నిజమే టీడీపీ నుంచే వచ్చాం.. నాని భాష సరైందే..? లోకేష్ ను కొట్టిస్తానంటూ మంత్రి రోజా వార్నింగ్
రెండో విడత అయినా దక్కుతుందని భావించినా కొన్ని రాజకీయ కారణాల వల్ల అది వీలు కాలేదు. అందుకే ఈ పదవితో కోలగట్లకు న్యాయం చేయడంతో పాటు.. ఆ సామాజికి వర్గానికి బెర్త్ ఇచ్చినట్టు అవుతుందని సీఎం లెక్కలు వేస్తున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక అయితే.. స్పీకర్.. డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉత్తారంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉంటారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan, AP News

Rakhi Sawant Birthday: రాఖీ సావంత్ అసలు పేరు… ఆమె వయసు తెలుసా… ?
తొడగొట్టిన గబ్బర్.. దిగ్గజాల సరసన చేరిక.. ఇలాంటి ప్లేయర్ ను ప్రపంచకప్ కు దూరం పెడతారా?
Amitabh Bachchan: నకిలీ లాటరీ స్కామ్..! కోర్టును ఆశ్రయించిన అమితాబ్ బచ్చన్
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *