Breaking News: బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నిక – News18 తెలుగు

Rishi Sunak: యూకే పీఎం కోర్ టీమ్ సభ్యుడి పూర్వీకులది బీహార్‌..సుయెల్లా నియామకంపై వివాదం
Narendra Modi-Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆ అంశంపైనే ప్
Rishi Sunak: యూకే పీఎంగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునక్.. తెలుసుకోవాల్సిన విషయాలివే..
Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ జీవిత విశేషాలు..భారత్‌తో ఎనలేని అనుబంధం..!
బ్రిటన్ (Britan) కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ (Rishi Sunak) ఎన్నికయ్యారు. మొత్తం 171 మంది ఎంపీలు మద్దతు తెలపడంతో రిషి బ్రిటిష్ పీఠాన్ని అధిరోహించనున్నారు. కాగా బోరిస్ జాన్సన్ (Boris Johnson) రాజీనామా తరువాత జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్ పై లిజ్ ట్రస్ (Liz Truss) విజయం సాధించి బ్రిటిష్ ప్రధానిగా ఎన్నికైంది. కానీ 45రోజులు తిరగకుండానే ఆమె పదవికి రాజీనామా చేసింది. దీనితో కొత్త ప్రధానిగా ఎంపీలు కలిసి రిషి సునాక్ ను ఎన్నుకున్నారు.

అయితే యూకేను గాడిలో పెడతానని లిజ్ ట్రస్ స్ (Liz Truss) అధికారంలోకి వచ్చారు. ఆ తరువాతే మినీ బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టారు. కానీ మినీ బడ్జెట్ పై ట్రస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం నెలకొన్నాయి. ఈ క్రమంలో తప్పులు చేశాం క్షమించండి అని పార్లమెంట్ లో కోరిన మరునాడే లిజ్ ట్రస్ స్ (Liz Truss) రాజీనామా చేశారు. అయితే తదుపరి ప్రధాని రేసులో బోరిస్ జాన్సన్ (Boris Johnson), రిషి సునాక్  (Rishi Sunak) పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరి నిమిషంలో బోరిస్ జాన్సన్ (Boris Johnson) రేసు నుంచి తప్పుకున్నారు. దీనితో రిషి సునాక్  (Rishi Sunak) యూకే ప్రధానిగా ఎన్నికయ్యాడు.

pic.twitter.com/w76rEvJdyQ

సునాక్ బ్రిటన్ 57వ ప్రధానమంత్రి మరియు దేశానికి నాయకత్వం వహించే మొదటి నల్లజాతీయుడు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి కూడా. అయితే, దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తన మతం గురించి చాలా అరుదుగా మాట్లాడేవారు.
“ఇవి అపూర్వమైన సమయాలు. నాయకత్వ పోటీ కోసం కంప్రెస్డ్ టైమ్‌టేబుల్ ఉన్నప్పటికీ, ఈ రోజు మనకు నిశ్చయత అవసరమని సహచరులు భావిస్తున్నారని స్పష్టమవుతుంది. దేశ శ్రేయస్సు కోసం వారు చిత్తశుద్ధితో ఈ నిర్ణయం తీసుకున్నారు" అని మోర్డాంట్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Britan, Rishi Sunak

Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ఆ రోజు నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
జాన్వీ కపూర్ ముందున్న అతి పెద్ద సవాల్.. తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి గెట్ రెడీ..
​Prasar Bharati Recruitment 2022: ప్రసారభారతిలో ఉద్యోగాలు.. పీజీ, ఎంబీఏ అర్హత.. వివరాలిలా
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *