Breaking News: మాజీ ఎంపీ.. బీజేపీ నేత అరెస్ట్.. కారణం ఏంటో తెలుసా..? – News18 తెలుగు

Jansena vs YCP: సీఎంలో రెండు ఫేస్ లు..! అమ్మా.. దొంగ దొంగ అంటూ పవన్ సైటర్లు..?
కంటె కూతుర్నే కనాలి అంటారు.. ఈ తండ్రి మాత్రం కుమార్తెకు ఏకం గుడి కట్టించాడు.. ఎందుకంటే
Infosys: ఇన్ఫోసిస్ కు వేగంగా అడుగులు.. త్వరలో విశాఖ నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు
Karthika Masam: కళ్లు తెరిచి భక్తులను చూస్తున్న లక్ష్మీదేవి.. కార్తీక మాసాన అమ్మవారి మహిమ
Breaking News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలుస్తోంది. ఈ రోజు ఆమెను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణం తీసుకుని చెల్లించని కేసులో గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు 52 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ రుణం చెల్లించక పోవడంతోనే బ్యాంకు అధికారులు గీత దంపతులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు. గీతను అరెస్ట్ చేసి బెంగుళూరుకు సీబీఐ అధికారులు తరలించినట్టు సమాచారం.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రుణం తీసుకుని ఎగవేసిన విషయమై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు 2015 జూలై 11న చార్జీషీట్ దాఖలు చేసింది. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆమె భర్త విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. రామకోటేశ్వరరావుపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి చార్జీషీట్ దాఖలు చేశారు.

చార్జీషీట్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకు హైద్రాబాద్ కు చెందిన నేషనల్ బ్యాంక్ మిడ్ కార్పోరేషన్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అప్పటి బ్రాంచ్ మేనేజన్ బీకే జయ ప్రకాశం , అప్పటి జనరల్ మేనేజర్ కేకే అరవిందాక్షన్ తదితరులపై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా..? స్పందించలేదు. దీంతో బ్యాంకు నుండి రుణం పొందేందుకు నిందితులు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చార్జీషీట్ లో సీబీఐ పేర్కొంది. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు వాస్తవాలను దాచారని సీబీఐ ఆరోపించారు. బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా చార్జీషీట్ లో సీబీఐ పేర్కొంది.
ఇదీ చదవండి : తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు..! తీరా అందులో ఉన్నది చూసి షాక్..!
ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు.. గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించారు. అలాగే గీత భర్త పి.రామకోటేశ్వరరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష ఫైన్ వేసింది. ఈ స్కామ్‌కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే విశ్వశ్వర ఇన్ ఫ్రా ప్రై.లి.కు 2 లక్షల జరిమానా విధించింది సీబీఐ కోర్టు. 2015లో నమోదైన కేసులో.. మంగళవారం తీర్పిచ్చింది న్యాయస్థానం. కొత్తపల్లి గీత సహా నిందితులను అదుపులోకి తీసుకుంది సీబీఐ. గీత భర్త, బ్యాంకు అధికారులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం వైద్యపరీక్షల కోసం గీతను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా తెలంగాణ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు గీత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Bjp, Vizag

Samantha: మరోసారి రుజువైన సమంత రేంజ్.. ఇండియాస్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ సామ్
Guava: ఈ సమస్యలు ఉన్న వాళ్లు జామపండుకు దూరంగా ఉండాలా ?.. ఎందుకంటే..
మరింత రసవత్తరంగా 2024 టి20 ప్రపంచకప్.. కొత్త ఫార్మాట్ రూల్స్ ఇవే
LIVE TV
NETWORK 18 SITES

source

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*