Telugu News

Chiranjeevi Top Disaster Movies : ఆచార్య సహా చిరంజీవి కెరీర్‌లో టాప్ డిజాస్టర్ మూవీస్ ఇవే.. – News18 తెలుగు

Chiranjeevi Top Disaster Movies : మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తెలుగులో సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్,కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తర్వాత స్వయంకృషితో తన కంటూ ఒక సామ్రాజ్యాన్నే ఏర్పరుచుకున్నారు. ఈయన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్‌తో పాటు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ తరంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించిన ఘనత చిరంజీవిదే. ఈయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు అదే రేంజ్‌లో డిజాస్టర్స్ మూవీస్ ఉన్నాయి. తాజాగా ఆచార్య మూవీతో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరో డిజాస్టర్ మూవీ చేరింది. మొత్తంగా చిరు కెరీర్‌లో డిజాస్టర్స్‌గా నిలిచిన సినిమాలేంటో చూద్దాం..
ఆచార్య | మెగా తండ్రీ తనయులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పూర్తి స్థాయిలో తొలిసారి నటించిన ’ఆచార్య’ మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉండటంతో మెగాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మెగా క్రౌడ్ పుల్లర్ హీరోలున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచింది. ఓవరాల్‌గా నిర్మాతలకు ఈ సినిమా రూ. 80 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశాలున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆచార్య కంటే ముందు చిరు కెరీర్‌లో ఉన్న డిజాస్టర్ మూవీస్ ఏవేవి ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి.. (Twitter/Photo)
శంకర్ దాదా జిందాబాద్ | హిందీలో సంజయ్ దత్ హీరోగా హిట్టైన ‘లగేరహో మున్నాభాయ్’ సినిమాను తెలుగులో చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’గా రీమేక్ చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. (File/Photo)
అంజి | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అంజి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. (Twitter/Photo)
మృగరాజు | మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణ శేఖర్ దర్శకత్వంలో దేవీవరప్రసాద్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. మృగరాజు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
రిక్షావోడు | మెగాస్టార్ చిరంజీవి హీరోగా క్రాంతి కుమార్ నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రిక్షావోడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
బిగ్‌బాస్ | విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన సినిమా ‘బిగ్‌బాస్’. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
SP పరశురాం  | మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్‌లో వచ్చిన పదకొండో చిత్రం ‘SP పరశురాం’.  ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, జీకే రెడ్డి, ముఖేష్ ఉదేషితో కలిసి సంయుక్తంగా తెరకెక్కించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘వాల్డర్ వెట్రివెల్’ చిత్రానికి రీమేక్. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తర్వాత చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Youtube/Credit)
స్టూవర్ట్‌పురం పోలీస్‌‌స్టేషన్ | చిరంజీవి, నిర్మాత కే.యస్.రామారావు కలయికలో వచ్చిన ఐదో చిత్రం ‘స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్’. ఈ చిత్రాన్ని రచయత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రం డిజాస్టర్‌ గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతి, నిరోషా కథానాయికలుగా నటించారు. (Youtube/Credit)
రాజా విక్రమార్క | మెగాస్టార్ చిరంజీవి, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రం తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండం’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
లంకేశ్వరుడు | మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో విజయ మాధవి ప్రొడక్షన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అందరి అంచనాలు తలకిందలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
త్రినేత్రుడు | చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన చిత్రం ‘తినేత్రుడు’. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన 2వ చిత్రం . ఈ  సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. హీరోగా చిరంజీవి 100వ చిత్రం.   (Youtube/Credit)
యుద్ధభూమి |మెగాస్టార్ చిరంజీవి,  దర్శకేంద్రుడి కలయికలో వచ్చిన ఏడో చిత్రం ‘యుద్ధభూమి’ . ఈ మూవీ  బాక్సాఫీస్ అనే యుద్ధంలో గెలవలేక డిజాస్టర్‌గా నిలిచింది.  (Youtube/Credit)
చక్రవర్తి | మెగాస్టార్ చిరంజీవి, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం ‘చక్రవర్తి’. తమిళంలో శివాజీ గణేషన్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన |  మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘ఆరాధన’. భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘కడలోరా కవితైగల్’ చిత్రానికి రీమేక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రాధిక, సుహాసిని హీరోయిన్స్‌గా నటించారు.  రాజశేఖర్ మరో ముఖ్యపాత్రలో నటించారు. (Youtube/Credit)
జేబు దొంగ | చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన చిత్రం ‘జేబు దొంగ’. రోజా మూవీస్ పతాకంపై అర్జున్ రాజు నిర్మించిన  ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Youtube/Credit)
రుద్రనేత్ర | చిరంజీవి, కే.రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ఎనిమిదో చిత్రం ‘రుద్రనేత్ర’. చిరంజీవి  జేమ్స్‌బాండ్ పాత్రలో నటించిన  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Youtube/Credit)
కిరాతకుడు  | చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన పదమూడో చిత్రం ‘కిరాతకుడు’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. (Youtube/Credit)
వేట | చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన పద్నాలుగో చిత్రం ‘వేట’. ఖైదీ సినిమా నిర్మాతలు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా  నిలిచింది. ఈ చిత్రం ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. (Youtube/Credit)
చాణక్య శపథం | కే.రాఘవేంద్రరావు, చిరంజీవి కలయికలో వచ్చిన ఐదో  చిత్రం ‘చాణక్య శపథం’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. విజయశాంతి హీరోయిన్‌గా నటించింది.  (Youtube/Credit)
ధైర్యవంతుడు | లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ధైర్యవంతుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి | మెగాస్టార్ చిరంజీవి తన పేరుతో నటించిన మూవీ ‘చిరంజీవి’. సీవీ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (File/Photo)
హీరో  |  మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్‌లో వచ్చిన  మరో చిత్రం ‘హీరో’. ఈ చిత్రం హాలీవుడ్‌లో హిట్టైన ‘ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ మూవీని తెలుగులో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Youtube/Credit)
శివుడు శివుడు శివుడు  |చిరంజీవి, ఏ కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన చిత్రం ‘శివుడు శివుడు శివుడు’. రాధిక హీరోయిన్‌గా  ఈ చిత్రాన్ని క్రాంతి కుమార్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
మొత్తంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో హిట్ సినిమాలతో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో చంటబ్బాయి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలకు టాక్ బాగున్నా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. మొత్తంగా చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు అభిమానులను నిరాశ పరిచిన చిత్రాలకు కూడా కొదవలేదు. (Twitter/Photo)










LIVE TV
NETWORK 18 SITES

source

Related Posts

1 of 226

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *