Gmail Offline: గూగుల్ భలే భలే ఫీచర్..! ఇకపై మెయిల్ చేయాలంటే నెట్ అవసరం లేదు.. ఆఫ్‌లైన్‌లోనే జీ-మెయిల్..!! – News18 తెలుగు

త్వరలో గూగుల్‌ మ్యాప్స్‌లో లైవ్‌ వ్యూ AR-బేస్డ్‌ సెర్చ్‌ ఆప్షన్‌..అప్‌డేట్‌ వివరాలు
ఫోన్‌ పే, గూగుల్‌ పేలకు ఆర్‌బీఐ షాక్?
Google Account: చనిపోయిన తర్వాత గూగుల్‌ డేటా ఏమవుతుంది? సన్నిహితులు పొందాలంటే ఎలా?
మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌వాచ్.. స్పెషల్ డిస్కౌంట్ తో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ యూజర్‌లు వినియోగిస్తున్న మెయిలింగ్‌ సర్వీసుల్లో జీమెయిల్‌(Gmail) మొదటి స్థానంలో ఉంటుంది. అత్యంత ప్రజాదరణ పొందిన మెయిలింగ్ సర్వీసుగా ఇది గుర్తింపు దక్కించుకుంది. గత సంవత్సరం నాటికి 1.8 బిలియన్‌ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు జీమెయిల్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. గూగుల్ (Google) ఈమెయిల్ సర్వీస్‌ ఇమెయిల్ క్లయింట్ మార్కెట్ వాటాలో 18 శాతం ఆక్రమించింది. ప్రస్తుతం దాదాపు 75 శాతం మంది వ్యక్తులు తమ మొబైల్ డివైజ్‌లలో జీమెయిల్‌ అకౌంట్‌ను యూజ్‌ చేస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం గూగుల్‌ కంపెనీ ఆఫ్‌లైన్‌లో కూడా జీమెయిల్‌ను వినియోగించే సదుపాయం కల్పిస్తోంది.

కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం మౌంటైన్ వ్యూ అనే సంస్థ తెలిపిన వివరాల మేరకు.. యూజర్‌లు ఇప్పుడు యాక్టివ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా జీమెయిల్‌లో వచ్చిన ఈమెయిల్‌ను చదివే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండానే ఈమెయిల్‌ను పంపించగలరు, జీమెయిల్‌లో ఏదైనా ఈమెయిల్‌ కోసం సెర్చ్‌ చేయగలరు. ఇది గూగుల్‌ నుంచి వస్తున్న అద్బుతమైన ఫీచర్‌ అని కంపెనీ పేర్కొంది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ తక్కువగా ఉన్న లేదా ఇంటర్నెట్ లేని ప్రదేశాలలో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో ఈ ఫీచర్‌ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. వినియోగదారులు జీమెయిల్‌ను ఆఫ్‌లైన్‌లో ఆన్ చేయడం కూడా చాలా సులభం. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.


* ముందు mail.google.comకి వెళ్లాలి. జీమెయిల్‌ ఆఫ్‌లైన్ గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome) వెబ్‌ బ్రౌజర్‌లో మాత్రమే పని చేస్తుంది. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజర్‌ను ఓపెన్‌ చేస్తే కూడా పని చేయదని, సాధారణ మోడ్‌లో బ్రౌజ్ చేస్తే మాత్రమే పని చేస్తుందని గూగుల్‌ చెబుతోంది.

* ఇప్పుడు జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌లోకి వచ్చిన తర్వాత, సెట్టింగ్స్‌ లేదా కాగ్‌వీల్ బటన్‌ను క్లిక్ చేయాలి.

* తర్వాత 'See all settings' క్లిక్‌ చేయాలి.

* ఆ పేజీకి చేరుకున్న తర్వాత, 'Offline' ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.

* అనంతరం ఎనేబుల్‌ ఆఫ్‌లైన్‌ మెయిల్‌ అనే ఆప్షన్‌ పక్కన చెక్‌బాక్స్‌ను క్లిక్‌ చేయాలి. చెక్‌బాక్స్‌ను క్లిక్‌ చేసిన వెంటనే జీమెయిల్‌ కొత్త సెట్టింగ్స్‌ను చూపుతుంది.

* ఇప్పుడు జీమెయిల్‌తో ఎన్నిరోజుల ఈమెయిల్‌లను సింక్రనైజ్‌ చేయాలనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

* కంప్యూటర్‌లో మిగిలి ఉన్న స్టోరేజ్‌ను గూగుల్‌ చూపుతుంది. కంప్యూటర్‌లో ఆఫ్‌లైన్ డేటాను స్టోర్‌ చేయాలా? లేదా ఆఫ్‌లైన్‌ డేటాను రిమూవ్‌ చేయాలా అనే ఆప్షన్‌లను చూపుతుంది.

* ఆఫ్‌లైన్ డేటాను ఉంచడానికి లేదా రిమూవ్‌ చేయడానికి ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న తర్వాత.. సేవ్‌ ఛేంజస్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే ఆఫ్‌లైన్ జీమెయిల్‌ కంప్యూటర్‌లో యాక్టివేట్‌ అవుతుంది.

ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను సులభతరం చేయడానికి జీమెయిల్‌ను బుక్‌మార్క్ చేయమని గూగుల్‌ సూచిస్తుంది. స్కూల్‌ అకౌంట్‌ ఖాతాతో జీమెయిల్‌ను ఉపయోగిస్తుంటే, ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లను ఎనేబుల్‌ చేయాలని అడ్మినిస్ట్రేటర్‌ను కోరాలి. జీమెయిల్‌ వినియోగదారులందరి కోసం ఈ ఫీచర్ రూపొందించారు. ఆఫ్‌లైన్‌ జీమెయిల్‌ సేవలను యాక్టివేట్‌ చేసిన తరహాలోనే ఆఫ్‌లైన్‌ సేవలను డీయాక్టివేట్‌ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GMAIL, Google, Internet, Tech news

చిరంజీవి సహా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు..
Megastar Chiranjeevi: చిరంజీవి కెరీర్‌‌ను మార్చేసిన టాప్ సినిమాలు ఇవే..
Kidney Disease: దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి అసలే కారణం అదే.. తేల్చిన తాజా అధ్యయనం
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *