Good News: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి పూర్తిగా అద్దె రద్దు.. ఆ కుటుంబాలకు పరిహారం రెట్టింపు – News18 తెలుగు

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు .. తెలంగాణలో కాస్త తగ్గిన చలి
ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
AP Congress: ఏపీ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు.. ప్రక్షాళన మొదలుపెట్టిన మల్లిఖార్జున ఖర్గే
10th Exam Fees: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫీజు గడువు ఎప్పటి వరకు అంటే..
Good News: సంక్షేమరంగానికి పెద్ద పీట వేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. రోజుకో వర్గానికి వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో మరిన్ని పథకాలు.. హామీలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా కల్లు గీత కార్మికులు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించారు. కల్లుగీత కుటుంబాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఐదేళ్లకు (2022-27) కల్లు గీత నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం (State Government) విడుదల చేసింది. ప్రస్తుతం కల్లు గీత కార్మికులు మరణిస్తే.. వారి కుటుంబానికి 5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. తాజాగా కల్లు గీత విధానం ద్వారా ఈ పరిహారాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు నరేగా, ఇతరత్రా ప్రభుత్వ పథకాల ద్వారా కల్లు గీత కార్మికులను ఆదుకుంటామని తన నూతన విధానంలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కల్లు గీత కార్మికులకు వైఎస్సార్ బీమాను వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గీత కార్మికుల నుంచి వసూలు చేస్తున్న తాటిచెట్టు అద్దెను రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం కల్లు తీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైన కార్మికులకు ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించనున్నారు. వీరికి వైఎస్సార్‌ బీమా ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మిక కుటుంబాలకు మేలు చేయడమే తమ ఉద్దేశమని చెప్పింది ప్రభుత్వం. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదేళ్ల విధానాన్ని ప్రకటించింది. 2022 నుంచి 2027 వరకు కాలానికి కల్లు గీత విధానం అమలులో ఉంటుంది. దీంతో రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కల్లుగీత లైసెన్సింగ్‌ విధానం కూడా అత్యంత పారదర్శకంగా జరిగేలా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి : ఏపీలో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఆ ప్రాంతానికి వరద ముప్పు..
గీత కార్మికుల కష్టాలు గుర్తించిన సీఎం జగన్ ఈ నిర్ణయాలు తీసుకున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో అత్యధికంగా గీత కార్మికులు ఉంటారు. దేశం మొత్తం మీద 8.51 కోట్ల తాటిచెట్లు ఉంటే.. ఒక్క తమిళనాడులోనే 5.31 కోట్ల చెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ రాష్ట్ర వృక్షం తాటిచెట్టే. అయినా, ఆ రాష్ట్రంలో ఎక్స్ గ్రేషియా చాలా తక్కువ. అసంఘటిత కార్మికులు మరణించిన సందర్భాల్లో ఇస్తున్నట్టు మాత్రమే పరిహారం ఇస్తున్నారు. దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రమాద బీమా, ఎక్స్ గ్రేషియా 10 లక్షలు ఇస్తున్నామన్నారు.
ఇదీ చదవండి : కుప్పంలో గెలుపు మనదే అంటున్నారు అధినేత జగన్.. కానీ అక్కడ పరిస్థితి ఇదీ
మరి చంద్రబాబు హయాంలో బీసీలకు ఏదైనా మేలు జరిగిందా అన్నారు మంత్రి వేణు.. చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్ మెంటు సక్రమంగా అమలైందా..?. ఫీజు రీయింబర్స్ మెంటులో కోతలు, ఆరోగ్యశ్రీలో కోతలు, ఆఖరికి స్కాలర్ షిప్పుల్లో కోతలు.. ఇలా బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Politics, Ap welfare schemes

కమలహాసన్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..
నాభి అందాలతో రచ్చ చేసిన కేతిక శర్మ .. పిక్స్ వైరల్..
Today Lucky rashi : లక్కీ రాశులు..ఆకస్మిక ధనలాభం,విదేశాల నుంచి శుభవార్త!
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *