Telugu News

Google| Russia: గూగుల్‌కు షాక్ ఇచ్చిన రష్యా.. రూ. 3000 కోట్ల భారీ జరిమానా – News18 తెలుగు

హాలిడే సీజన్ ఫ్రాడ్స్‌తో జాగ్రత్త.. యూజర్లకు గూగుల్ అలర్ట్.. అసలేంటీ స్కామ్స్?
Crude Oil: రష్యాకు అమెరికా, యూరోప్ దేశాలు అలా షాక్ ఇవ్వనున్నాయా ?
Google Ads: గూగుల్‌ యాడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి.. మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక
Layoff : ఐటీలో "లే ఆఫ్" సీజన్..10వేల ఉద్యోగులను తొలగించాలని గూగుల్ నిర్ణయం!
ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో గూగుల్ తప్పుదోవ పట్టించే వార్తలను నడుపుతోందని ఆరోపిస్తూ రష్యా రూ.3,000 కోట్ల జరిమానా విధించింది. రష్యాకు(Russia) వ్యతిరేకంగా చట్టవిరుద్ధమైన, తప్పుదారి పట్టించే వార్తలను నడుపుతున్నందుకు, ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War)గురించి తప్పుడు కంటెంట్‌ను అందించినందుకు గూగుల్‌ను దోషిగా మాస్కో కోర్టు నిర్ధారించింది. ప్రభుత్వం పదేపదే హెచ్చరించినప్పటికీ, అటువంటి కంటెంట్‌ను YouTube, ఇతర చోట్ల నుండి తీసివేయబడలేదని Google‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కారణంగా గూగుల్‌పై 21.1 బిలియన్ రూబిళ్లు (దాదాపు రూ. 3,000 కోట్లు) జరిమానా విధించింది. టాన్స్కీ కోర్టు గూగుల్‌కి $373 మిలియన్ జరిమానా విధించిందని రెగ్యులేటర్ రోస్క్‌మెన్జోర్ తెలిపారు.

పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ కంపెనీ తన సైట్ నుండి నిషేధిత మెటీరియల్‌ని తీసివేయడం లేదని… యూట్యూబ్‌కు కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. యుక్రెయిన్ యుద్ధ సమయంలో జరిగిన సైనిక కార్యకలాపాల మెటీరియల్‌ని యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించడం లేదని పేర్కొంది. అదే సమయంలో రష్యాలో దాని మొత్తం వార్షిక టర్నోవర్ ప్రకారం Googleపై జరిమానా మొత్తాన్ని కోర్టు నిర్ణయించింది. గత ఏడాది కంపెనీకి 7.2 బిలియన్ రూబిళ్లు జరిమానా కూడా విధించింది. రష్యాలో ఉన్న గూగుల్ ఖాతాను కూడా సీజ్ చేశారు. దీంతో పాటు కంపెనీపై దివాలా ప్రక్రియను ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టంగా మారింది.


మాస్కో తన సైట్, యూట్యూబ్ నుండి అటువంటి కంటెంట్‌ను తీసివేయవద్దని, రీప్లే చేయవద్దని అనేకసార్లు గూగుల్‌ని హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కంపెనీ మరింత తాపజనక మరియు తప్పుడు సందేశాలను ప్రసారం చేసింది. గూగుల్ యొక్క మాతృ సంస్థ, ఆల్ఫాబెట్, యూట్యూబ్ చాలా కాలంగా రష్యాచే లక్ష్యంగా ఉంది. అయితే ట్విట్టర్, మెటా వంటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రబలంగా నడుస్తున్నాయి. గూగుల్ మనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే దీనికి అతిపెద్ద కారణమని రోస్క్‌మెన్‌జోర్ అన్నారు.

Amazon Rainforest: త్వరలో కనుమరుగుకానున్న అమెజాన్ అడవులు.. అధ్యక్షుడే నాశనానికి కారణమా.. చదివితే నిజంగా బాధపడతారు !

Solar Storm : దూసుకొచ్చిన సౌర తుఫాను.. భూమిని తాకేది నేడే -జీపీఎస్, రేడియో సిగ్నల్స్ క్రాష్!

చట్టవిరుద్ధమైన నిరసనల కోసం రష్యా యువతను యూట్యూబ్ కూడా ప్రేరేపిస్తుందని తాజా కేసులో కోర్టు కనుగొంది. ఇందుకోసం ఆన్‌లైన్ సర్వేల ద్వారా కంపెనీ ప్రజలను ప్రభుత్వంపై ఉసిగొల్పుతుంది. పిల్లలను తప్పుదారి పట్టించేందుకు నిషేధిత వీడియో కంటెంట్‌ని ఉపయోగిస్తుంది. రష్యన్ చట్టానికి వ్యతిరేకంగా గూగుల్ తప్పుడు కంటెంట్‌ను చూపుతుందని సమాచార విధానంపై పార్లమెంటరీ కమిటీ డిప్యూటీ హెడ్ అంటోన్ గోర్కిన్ అన్నారు. ఈ కంపెనీ ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తుందో తనకు అర్థం కావడం లేదని.. ఈ కారణంగా అది రష్యాలో దాని మార్కెట్‌ను కోల్పోతుందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Russia

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో భారీగా స్పెషల్ ట్రైన్లు.. వివరాలు
Anveshi Jain: చీరకట్టు, నగలతో సరికొత్తగా అన్వేషి లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..
Health Tips: ఉదయాన్నే టీతో టోస్ట్‌ని ఇష్టంగా తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
LIVE TV
NETWORK 18 SITES

source

Related Posts

1 of 226

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *