Hero Akhil Raj: బీచ్లో కొట్టుకుపోయిన యువహీరో.. చావు తప్పి కన్నులొట్ట బోయి! – Zee Hindustan తెలుగు

Akhil Raj saved from drowning at Gokana Kudle beach: తెలుగు హీరో అఖిల్ రాజ్ ఒక పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు, ఆ వివరాల్లోకి వెళితే 
Telugu Hero Akhil Raj saved from drowning at Gokana Kudle beach: సాధారణంగా మనం వార్తల్లో బీచ్ లో కొట్టుకుపోయిన యువకులు, కాలేజ్ స్టూడెంట్స్ వంటి వార్తలు చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి పొరపాటున ఆ వార్తల్లో ఒక యువ హీరో నిలిచాడు. తెలుగులో రెండు సినిమాలో హీరోగా నటించి మరో సినిమాలో ప్రస్తుతం హీరోగా నటిస్తున్న అఖిల్ రాజ్ సెలవుల నేపద్యంలో కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ వెళ్ళాడు. అక్కడ దైవ దర్శనం అనంతరం కుడ్లే బీచ్ కి వెళ్ళిన అఖిల్ సరదాగా ఈత కొట్టడం ప్రారంభించాడు.
అయితే కొద్దిసేపటికి అఖిల్ లోపలికి కొట్టుకుపోవడం చూసిన అక్కడి స్థానిక ప్రజలు, రెస్క్యూ టీమ్ సిబ్బంది వెంటనే స్పందించారు. అప్పటికప్పుడు స్పీడ్ బోట్ లో వెళ్లి అఖిల్ రాజ్ ను కాపాడారు. లేదంటే అఖిల్ ప్రాణం అప్పటికప్పుడు పోయేదట.  రెస్క్యూ టీమ్ సభ్యులు కాపాడి అఖిల్ ని బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తనకు ఈత వచ్చిన సరే సముద్రంలో అలలు తనను లోపలికి లాక్కుని వెళ్ళాయని అఖిల్ రాజ్ చెప్పుకొచ్చారు. తనను కాపాడిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఆయనకు గోకర్ణలో వసతి ఏర్పాటు చేసిన వినాయక శాస్త్రి మాట్లాడుతూ దైవాన్ని దర్శించుకున్న అనంతరం కాసేపు సరదాగా ఈత కొడతానని వెళ్ళాడని అయితే ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చారు. రెస్క్యూ టీమ్ సభ్యులు లేకపోతే ఆయన ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు కాదని వినాయక శాస్త్రి అభిప్రాయపడ్డారు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్ హీరోగా రెండు సినిమాలు పూర్తి చేశాడు. ప్రస్తుతం అనన్య నాగళ్ల హీరోయిన్గా ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఈ ఏడాది జూలైలో అధికారికంగా లాంచ్ అయింది. ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతుంది.
అంతేకాక దేత్తడి హారిక ఛానల్ లో ఏవండోయ్ ఓనర్ గారు అనే ఒక వెబ్ సిరీస్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో హారిక బాయ్ ఫ్రెండ్ పాత్రలో అఖిల్ రాజ్ నటించారు. ఇక అఖిల్ రాజ్ అలా సముద్రంలో కొట్టుకుపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంచెంలో అఖిల్ రాజ్ ప్రాణాపాయం తప్పించుకున్నాడని లేకపోతే టాలీవుడ్ లో పెను విషాదం చోటు చేసుకుని ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో సముద్రాలు, సరస్సులు లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి లోతు, అక్కడ పరిస్థితులను అవగాహన తెచ్చుకోకుండా ముందుకు వెళ్లి రిస్క్ చేయకండి. 
Also Read: Jabardasth Varsha Hot Photos: జబర్దస్త్ ‘వర్ష’ను ఇంత హాట్ గా మునుపెన్నడైనా చూశారా?

Also Read: Actress Poorna Marriage : పూర్ణ పెళ్లి ఎప్పుడో అయిపోయిందంట.. అసలు విషయం చెప్పేసిన నటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  
Android Link – https://bit.ly/3P3R74U
Apple Link – https://apple.co/3loQYe 
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
TRENDING TOPICS

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *