Ninne Chusthu: చిన్న సినిమాల నుంచి హీరోగా ఎదిగాను.. సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు – News18 తెలుగు

యాంకర్ అవతారం ఎత్తిన దిల్ రాజు.. మసూద చిత్ర యూనిట్‌ను తనదైన శైలిలో ప్రశ్నించిన బడా నిర్మాత
శబరిమల అయ్యప్ప టెంపుల్‌లో హీరో నాని ప్రత్యేక పూజలు ..ఎవరితో కలిసి చేశారో వీడియో చూడండి
అదిరిన హనుమాన్ టీజర్.. ఈ రేంజ్ ఊహించలేదు..
Director Madan: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూత
వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్లో, శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా, కే. గోవర్ధనరావు దర్శకత్వంలో, పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన చిత్రం “నిన్నే చూస్తు”. ఈ సినిమాకు రమణ్ రాథోడ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, ఈ పాటలలోని రిధమ్స్, బీట్స్‌ కు ప్రేక్షకుల నుండి విశేషంగా ఆదరణ లభిస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 27 న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్ ‘నిన్నే చూస్తు’ ప్రి రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ నటులు సుమన్, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, నిర్మాత రామ సత్యనారాయణ లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ ఎంతో బిజీ ఉన్న నాకు సుమన్ గారు ఫోన్ చేసి నిర్మాత, నటి అయిన హేమలత రెడ్డి గారి గురించి చెప్పడంతో ఈ సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చాను. ట్రైలర్, పాటలు చూసిన తర్వాత పెద్ద సినిమాల రేంజ్ లో మంచి క్వాలిటీ తో తీసిన హేమలత రెడ్డి గారి గురించి సుమన్ గారు ఎందుకు చెప్పారనేది తెలిసింది. ఫారిన్ లోకేషన్స్ లో కూడా ఈ సినిమా పాటలను షూట్ చేయడం జరిగింది.చిన్న సినిమాలు ఇండస్ట్రీకి రావడం ఎంతో అవసరం ఫిల్మ్ చాంబర్ ఎప్పుడూ ఆట్టి దర్శక, నిర్మాతలకు సపోర్ట్ చేస్తుంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

సీనియర్ యాక్టర్ సుమన్ మాట్లాడుతూ.. నాకు ఫోన్ చేసి సినిమా డేట్స్ కావాలన్నప్పుడు నేను బిజీగా ఉన్నా నాకున్న డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని డేట్స్ ఇచ్చాను. నేను చిన్న సినిమాల నుంచి హీరోగా ఎదిగాను. ఇక్కడే యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. నటి, నిర్మాత హేమలత రెడ్డి చాలా యంగ్ అండ్ డైనమిక్ లేడీ తను సుహాసిని, భానుచందర్ లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని సినిమాలో నటిస్తూనే నిర్మాతగా సినిమాను చాలా చక్కగా డీల్ చేసింది. ఈ సినిమాలో తన డైలాగ్స్ అన్ని సింగల్ టేక్ లో చేసుకుంటూ అటు నిర్మాతగా ఇటు యాక్టర్ గా చేస్తూ సర్కస్ లో రింగ్ మాస్టర్ లా తనే దగ్గరుండి చూసుకుంటూ షూటింగ్ సక్సెస్ చేసింది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు నేను కార్ లో సెల్ ఫోను చూసుకుంటూ వస్తున్నాను. ప్రసాద్ ల్యాబ్ లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడున్న డెకరేషన్ చూసి సడన్ గా బ్రేక్ వేసాను. తిరిగి చూస్తే మొత్తం డెకరేషన్ తో నిండి పోయింది అడ్రస్ చేంజ్ అయ్యి ఏదైనా పెళ్లి కి వచ్చానా అని కంగారు పడి సైడ్ చూస్తే "నిన్నే చూస్తూ" పోస్టర్ కనిపించింది. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆర్టిస్టుల విషయంలో కానీ, ప్రమోషన్ లో కాని, బడ్జెట్ లో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ వచ్చేలా సినిమా తీయడం జరిగింది. ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అన్నారు.
చిత్ర హీరోయిన్, నిర్మాత పోతిరెడ్డి హేమలత రెడ్డి గారు మాట్లాడుతూ.. మా సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని చిత్రీకరించాలనే మంచి కథతో నాకు ఇష్టమైన హీరో సుమన్, భానుచందర్, సుహాసిని, షియాజి సిండే, కిన్నెర లతో కలిసి మంచి సినిమా చెయ్యాలని ఇండస్ట్రీకి వచ్చిన నాకు ఇండస్ట్రీ లో ఆలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పి చాలా మంది భయపెట్టారు.అయినా అవేమి పట్టించుకోకుండా సీనియర్ యాక్టర్స్ అందరి డేట్స్ సెట్ చేసుకొని సినిమా స్టార్ట్ చేశాము. కొంచెం షూట్ జరగగానే కోవిడ్ రావడంతో మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది.
మా సినిమా కోసం సుమన్, భానుచందర్, సుహాసిని, షియాజి సిండే, కిన్నెర లు డేట్స్ అడ్జస్ట్ చేసుకొని షూట్ వచ్చారు. మళ్ళీ వారి డేట్స్ సెట్ కాకపోతే సినిమా ఆగిపోతుందేమో అనుకున్నాను. ఇలాంటి టైమ్ లో ఫణి గారు అందరితో కోఆర్డినేట్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. షూటింగ్ టైంలో సీనియర్ నటులమనే తేడాలు చూపించకుండా మాకు సలహాలు, సూచనలు ఇస్తూ మాకు తల్లి, తండ్రుల్లా సపోర్ట్ చేశారు. వీరితో పాటు దర్శకుడు గోవర్ధన్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ్ ఇలా అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా పూర్తిచేయగలిగాము. ఇందులో ఉన్న ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి.ఆ తర్వాత సినిమా ప్రమోషన్ కొరకు సుమన్ గారిని అడగలనుకొన్నాను.అయితే ఎంతో బిజీగా ఉన్న వీరు సపోర్ట్ చేస్తారా లేదా అనుకుంటూ అడగడం జరిగింది. సుమన్ గారు మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పడం తో మాకెంతో దైర్యం వచ్చింది. సో మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సుమన్ గారికి, పెద్దలకు ధన్యవాదాలు. నాకు చాలా హెల్ప్ చేసిన ఫణి గారు నా నెక్స్ట్ సినిమాకు దర్శకుడిగా చేస్తున్నాడు. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకుండా మా సినిమాను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాని ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. సుమన్, బానుచందర్, సుహాసిని ఇలా అందరు సీనియర్ ఆర్టిస్ట్ ల తో తీస్తున్న ఈ సినిమాలో ఆరు పాటలు ఉండడం విశేషం.ఈ ఆరు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకొని నిర్మిస్తున్న ఇలాంటి ప్రొడ్యూసర్లకు మా నిర్మాతల మండలి థియేటర్ల విషయంలో గానీ ఏ విషయంలో అయినా సపోర్ట్ చేయడానికి ముందు ఉంటాము. ఈ నెల 27 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ మంచి కథతో ఈ నెల 27 న వస్తున్న "నిన్నే చూస్తు" సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actor

చిరంజీవి సహా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు..
Megastar Chiranjeevi: చిరంజీవి కెరీర్‌‌ను మార్చేసిన టాప్ సినిమాలు ఇవే..
Kidney Disease: దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి అసలే కారణం అదే.. తేల్చిన తాజా అధ్యయనం
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *