Solar Eclipse: తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేత.. రోజు మొత్తం కొన్ని బంద్.. ఇవాళ తెరుచుకునే ఆలయాలు ఇవే? – News18 తెలుగు

ఎన్నారై అయినా ఒకే.. లేక చంద్రబాబు లోకేష్ అయినా రెడీ..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Tension: తిరుపతిలో భయం భయం.. చీకటి పడితే చాలు బయటకు రావాలంటే వణుకే..
Mega Plan: మోదీ ప్లాన్ వర్కౌట్ అవుతోందా..? చిరంజీవి వ్యాఖ్యలకు కారణం అదేనా..?
CM Jagan: సరికొత్త ఎన్నికల నినాదాన్ని తెరపైకి తెచ్చిన సీఎం జగన్.. వర్కౌట్ అయ్యేనా..?
Solar Eclipse: ఈ రోజు వచ్చేది పాక్షిక సూర్యగ్రహణమే (Solar Eclipse) .. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కనిపించేందుకు కూడా తక్కువ సమయమే కానీ సూర్య గ్రహణ ప్రభావంతో.. దాదాపు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలు అన్నీ మూసివేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కలియుగ వైకుంఠం.. తిరుమల  (Tirumala) శ్రీవారి ఆలయం 8 గంటల నుంచి మూసేశారు. విజయవాడ (Vijayawada) దుర్గగుడిని 11 గంటలకు మూశేశారు. యాదాద్రి ఆలయాన్ని 8.50 నుంచి మూసేశారు. అలాగే భద్రాద్రి రామాలయం 10 గంటలకు.. శ్రీశైలం ఆలయం, సింహాద్రి అప్పన్న, అన్నవరం పుణ్యక్షేత్రాలు వేకువజామునుంచే మూసివేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుమలలో సూర్యగ్రహణం విడిచిన తరువాత కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుమలలో అన్ని సేవలు నిలిపివేసి.. ఆలయాన్ని మూసేశారు. సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం కార‌ణంగా.. ఉద‌యం 8 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యం మూసివేశారు.
గ్రహణం కారణంగా ద‌ర్శనాలకు బ్రేక్‌ పడింది. ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, వృద్ధులు, విక‌లాంగులు, చంటిపిల్లల త‌ల్లిదండ్రులు, ర‌క్షణ సిబ్బంది, ఎన్ఆర్ఐల ద‌ర్శనంతోపాటు.. ఆర్జిత సేవ‌లైన క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార‌సేవ‌ల‌ను రద్దు చేసింది టీటీడీ. గ్రహణం అనంతరం స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌ను మాత్రమే అనుమ‌తించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఇక సూర్యగ్రహణం కావటంతో నేడు ఇంద్రకీలాద్రి మూసివేశారు అధికారులు. అమ్మవారి పూజల తరువాత 11 గంటలకు ఇంద్ర కీలాద్రికి తాళాలువేశారు. రేపు ఉదయం ఆరుగంటలకు స్నాపనభిషేకం, పూజలు తర్వాత తెరుచుకోనున్న ఆలయాలు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ. సూర్యగ్రహణం సందర్భంగా సింహాద్రి అప్పన్న భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఉదయం 6 గంటల నుండి 9 వరకే భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా అన్ని ఆర్జితసేవలు రద్దు చేశారు. తిరిగి రేపు ఉదయం సుప్రభాత సేవ తరువాత 6 గంటల నుండి ఎదావిధిగా భక్తులకు స్వామి దర్శనాలకు అనుమతిస్తామన్నారు.
ఇదీ చదవండి : ఇంటెలిజెన్స్ పేరుతో మరో డ్రామా? జనసేనపై కక్షసాధింపుకు స్కెచ్ అంటూ నాగబాబు ఫైర్
శ్రీ సత్య సాయి జిల్లా సూర్యగ్రహణం నేపథ్యంలో లేపాక్షి లోని శ్రీ దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయం మూసివేశారు. ఆలయం శుద్ధి తరువాత.. రేపు భక్తులకు పునఃదర్శనం కల్పించనున్నారు. ఇక కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం తలుపులు మూసివేశారు అధికారులు. సంప్రోక్షణ తర్వాత రేపు పునఃదర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు. అనంతపురం జిల్లా సూర్య గ్రహణం సందర్భంగా గుంతకల్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం మూసివేశారు అధికారులు. సంప్రోక్షణ తర్వాత దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు.
ఇదీ చదవండి: భక్తులను హింసించే వారి భరతం పట్టే అమ్మవారు.. దీపావళి రోజుల్లో మాత్రమే తెరిచే ఆలయం ఇది..
విజయనగరం జిల్లాలోని నేడు సూర్యగ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలన్నీ మూసువేశారు అధికారులు. సూర్యగ్రహణం కారణంగా‌ రామతీర్థంలో కొలువైన రాములవారి ఆలయం‌ నేడు మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటించారు. ఏలూరు లోసూర్యగ్రహణం కారణంగాద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం మూసివేశారు. రేపు ఉదయం ఆలయ శుద్ధి అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. నేడు సూర్యగ్రహణం సందర్భంగా కాకినాడలో ఉదయం 11 గంటల నుండి అన్నవరం సత్యదేవుని ఆలయం మూసివేశారు అధికారులు. రేపు ఆలయ సంప్రోక్షణము అనంతరం ఉదయం 6 గంటల నుండి యదా విధిగా స్వామివారి దర్శనాలు వ్రతాలు సేవలు ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి : ఢిల్లీకి పవన్.. డేట్ ఫిక్స్ అయ్యిందా..? రూట్ మ్యాప్ పై క్లారిటీ..! అమిత్ షా ట్వీట్
కర్నూలు జిల్లాలో నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు నిలిపివేశారు అధికారులు. నేడు కౌతాళం మండలం ఉరుకుందు ఈరన్న స్వామి దేవాలయం మూసివేశారు. నంద్యాలలో బనగానపల్లె (మం) యాగంటి ఉమామహేశ్వరస్వామి, నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయాలు మూసివేశారు అధికారులు. ఉదయం 6 నుండి సాయంత్రం 6.30 వరకు ఆలయ ద్వారాలు మూసివేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి సంప్రోక్షణ ఉంటుంది. రాత్రి 7 గంటలకు నుండి ఉమాహేశ్వరస్వామి, చౌడేశ్వరి అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news

చిరంజీవి సహా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు..
Megastar Chiranjeevi: చిరంజీవి కెరీర్‌‌ను మార్చేసిన టాప్ సినిమాలు ఇవే..
Kidney Disease: దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి అసలే కారణం అదే.. తేల్చిన తాజా అధ్యయనం
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *