Telugu Cinema : ఈ వారం థియేటర్/ఓటిటిలో రాబోయే సినిమాలు ఇవే – 10TV Telugu

Home » Latest » Telugu Cinema : ఈ వారం థియేటర్/ఓటిటిలో రాబోయే సినిమాలు ఇవే
ఈ వారం థియేటర్లలో యువ హీరోలు సందడి చేయబోతున్నారు. ఈ శుక్రవారం ఒకేసారి 5 సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి.
Telugu Cinema :  కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు బాగానే రిలీజ్ అవుతున్నాయి. ఒక పక్క ఓటిటిలో, మరో పక్క థియేటర్ లో సినిమాలు రిలీజ్ అయి మంచి విజయాలు సాధిస్తున్నాయి. కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. గత వారం దీపావళి సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ వారం థియేటర్లలో యువ హీరోలు సందడి చేయబోతున్నారు. ఈ శుక్రవారం ఒకేసారి 5 సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి.
Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ దశ దిన కర్మ.. అన్నదానాలు.. నేత్రదాన శిబిరాలు..
కార్తికేయ హీరోగా రాబోతున్న యాక్షన్ కామెడీ సినిమా ‘రాజా విక్రమార్క’ 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రాబోతున్న ‘పుష్పక విమానం’ 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాని విజయ్ తన సొంత బ్యానర్ లో నిర్మించాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన యాక్షన్ మూవీ ‘కురుప్’ పాన్ ఇండియా వైడ్ గా 12వ తేదీన రిలీజ్ అవ్వనుంది. శ్రీకాంత్ హీరోగా నటించిన కెసిఆర్ బయోపిక్ ‘తెలంగాణ దేవుడు’ సినిమా కూడా 12వ తేదీన విడుదల అవ్వనుంది. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన ‘కె3 కోటికొక్కడు’ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా 12వ తేదీన రిలీజ్ అవ్వనుంది. ‘ది ట్రిప్’ అనే చిన్న సినిమా కూడా 12వ తారీఖున థియేటర్లలో రానుంది.
Akhanda : హాట్ స్టార్ ఓటిటిలో అఖండ.. ఎప్పటి నుంచి ??
తెలుగు ఓటిటి ఆహాలో పూర్ణ, ఈషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ‘3 రోజెస్’ సినిమా 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.
జీ5 లో అరణ్మణై 3 తమిళ సినిమా, స్క్వాడ్‌ హిందీ సినిమా నవంబరు 12న స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.
డిస్నీ హాట్‌స్టార్‌ లో డోప్‌ సిక్‌ వెబ్‌సిరీస్‌, హోమ్‌ స్వీట్‌ హోమ్‌ ఎలోన్‌, జంగిల్‌ క్రూయిజ్‌, షాంగ్‌-చి హాలీవుడ్‌ సినిమాలు, కనకం కామిని కలహం మలయాళం సినిమా, స్పెషల్‌ ఆప్స్‌ వెబ్‌సిరీస్‌ లు నవంబరు 12 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌ లో రెడ్‌నోటీస్‌ హాలీవుడ్‌ సినిమా నవంబరు 12 నుంచి స్త్రీమెన్ కాబోతుంది.
Copyright 2022 © Developed by Veegam Software Pvt Ltd.

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *