Tollywood News : చిత్ర పరిశ్రమలో విషాదం.. నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కన్నుమూత – News18 తెలుగు

అదిరిన హనుమాన్ టీజర్.. ఈ రేంజ్ ఊహించలేదు..
రష్మిక మందన్నకి సారీ చెప్పిన వార్నర్ బాబాయ్.. కారణం ఆ వీడియోనే!
స్వగృహానికి భౌతిక కాయం… ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు..
సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు.. ప్రముఖుల సంతాపం..
తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. గత సంవత్సరం నుంచి చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కొందరు ప్రముఖులు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక తాజాగా మరో నటున్ని కోల్పోయింది తెలుగు చిత్ర పరిశ్రమ. సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64) అనారోగ్యంతో మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ పలు సినిమాల్లో నటించారు. అంతేకాకుండా బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించారు. రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఆయన రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి మొదలగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ గతంలో గ్రామ సర్పంచ్ గా పని చేశారు. నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news

చిరంజీవి సహా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు..
Megastar Chiranjeevi: చిరంజీవి కెరీర్‌‌ను మార్చేసిన టాప్ సినిమాలు ఇవే..
Kidney Disease: దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి అసలే కారణం అదే.. తేల్చిన తాజా అధ్యయనం
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *