Tollywoos vs AP Government: సర్కార్ ప్లాన్ కు నో చెప్పిన టాలీవుడ్.. ఆన్ లైన్ టికెట్ల వివాదంలో మరో ట్విస్ట్… – News18 తెలుగు

వీర విధేయులు.. మాజీ మంత్రులకు ఊహించని షాక్.. వారిని తప్పించడానికి కారణాలు ఇవే..?
ఆ జిల్లాను వెంటాడుతున్న వర్గపోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఫైట్.. సజ్జల దగ్గర పంచాయితీ
Face recognition: గుండు గీయించుకోవడమే శాపమా..? జాబ్ నుంచి తీసేసిన అధికారులు
రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు.. ఎందుకంటే..?
Tollywood vs AP Government: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సినిమా టికెట్ల అమ్మకాల వ్యవహారంలో ప్రభుత్వ ఆలోచనకు టాలీవుడ్ నో చెబుతోంది. ఆన్ లైన్లో టికెట్ల (Online Tickets) అమ్మకాలపై తాజాగా ఏపీ ప్రభుత్వం (AP Government) చేసిన ప్రతిపాదనలను ఎగ్జిబిటర్లు అంగీకరించడం లేదు. దీంతో ఎగ్జిబిటర్లతో పూర్తిస్దాయిలో ఒప్పందాలు చేసుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. దీనికి వారు చెప్తున్న అభ్యంతరాలే కారణం అంటున్నారు. ముఖ్యంగా టికెట్లను తామే అమ్మి.. మీ వాటా మీకు ఇస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనే సమస్యకు కారణమవుతోంది. ఇటీవల సుదీర్ఘ చర్చలు.. సినిమా ఇండస్ట్రీ అభిప్రాయ సేకరణ తరువాత.. ఏపీలో ఆన్ లైన్ విధానంలో సినిమా టికెట్లు విక్రయంచేందుకు వీలుగా ప్రభుత్వం ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు బాధ్యత అప్పగించింది.

ఆన్ లైన్ టికెట్ల అమ్మకాల కోసం ఓ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసేందుకు ఏపీఎఫ్ డీసీ ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో సినిమా టికెట్లు అమ్మాలంటే థియేటర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం విధించిన నిబంధన కీలకంగా మారుతున్నాయి. సినిమా టికెట్లను ఏపీఎఫ్డీసీ ద్వారా తామే అమ్ముతాం. వాటిలో మీకు వచ్చే వాటాను టికెట్లు అమ్ముడయ్యాక ఇచ్చేస్తామంటూ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీనికి ఎగ్జిబిట్లర్లు అంగీకరించడం లేదు.


ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఏ సినిమాకైనా టికెట్ల అమ్మకాలను ఏపీఎఫ్డీసీ ద్వారా చేయాలి. అయితే అలా ఆన్ లైన్ లో వసూలు చేసిన సొమ్ము నేరుగా నిర్వహణ ఖాతాకు వెళ్తుంది. అందులో నుంచి సర్వీస్ ట్యాక్స్ మినహాయించుకుని మిగతా మొత్తం మీ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీనికి అంగీకరిస్తూ ఏపీఎఫ్డీసీతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఒప్పందాలు చేసుకోకపోతే థియేటర్ల లైసెన్స్ లు రద్దు చేస్తామని బెదిరిస్తోంది. దీంతో ఎగ్జిబిటర్లు ఈ విషయంపై ఆందోళన చెందుతోంది.

ఇదీ చదవండి : గత ఎన్నికల్లో నెగ్గిన చోట కూడా టీడీపీ షాక్.. ఆ మహిళా నేత పోటీకి దూరం అవుతున్నారా..?

ఆన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాలు తామే చేస్తాం, అందులో మీ వాటా మీకిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనకు ఎగ్జిబిటర్లు కుదరదంటున్నారు. దీని వెనుక వారు పలు కారణాలు చెప్తుతున్నారు. ఉదాహరణకు ఓ సినిమా టికెట్లు అడ్వాన్స్ గా అమ్మేశారు. ఆ తర్వాత సినిమా పడలేదు. అప్పుడు ప్రేక్షకులకు డబ్బులు ఎవరు తిరిగి చెల్లిస్తారని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే థియేటర్ కు వచ్చి నేరుగా టికెట్లు కొనే వారికి ప్రభుత్వం విధిస్తున్న 2 శాతం సర్వీస్ ఛార్జ్ ఎందుకని ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు.

ఇదీ చదవండి : వైసీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు.. 23 నుంచి వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ.. అందరి చూపు ఆమెపైనే?

గతంలో ఏపీలో సినిమా ధియేటర్లు పేటీఎం, బుక్ మై షో వంటి ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏపీఎఫ్డీసీ ద్వారా ఒప్పందాలు చేసుకోవాలని అల్టిమేటం ఇస్తోంది. దీంతో పాత ఒప్పందాలను ఇప్పటికిప్పుడు బ్రేక్ చేసుకోవడం కుదరదనే వాదన ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తోంది. ఈ ఒప్పందాలను మధ్యలో బ్రేక్ చేస్తే గతంలో ఆయా సంస్ధల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Movie, Tollywood

Anveshi Jain: చీరకట్టు, నగలతో సరికొత్తగా అన్వేషి లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..
Health Tips: ఉదయాన్నే టీతో టోస్ట్‌ని ఇష్టంగా తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
కేవలం రూ.5 వేల పెట్టుబతో నెలకు రూ.60 వేల ఆదాయం.. ఈ బిజినెస్ ఐడియాపై ఓ లుక్కేయండి
LIVE TV
NETWORK 18 SITES

source

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*