TSPSC Group 2 Exam Pattern: గ్రూప్ 2కు జాబ్ మీ లక్ష్యమా? అయితే.. ఎగ్జామ్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి – News18 తెలుగు

నిరుద్యోగులకు శుభవార్త.. SBI నుంచి 3 జాబ్ నోటిఫికేషన్స్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తులు..
RRB Group D Results: నిరుద్యోగులకు అలర్ట్.. వారంలో రైల్వే గ్రూప్ డీ ఫలితాలు..!
Notifications Cancelled: షాకింగ్.. మరో ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు.. ఆందోళనలో నిరుద్యోగులు..
త్వరలో జేఈఈ మెయిన్-2023 నోటిఫికేషన్.. ఎగ్జామ్ ప్యాట్రన్‌ వివరాలు ఇవే..
తెలంగాణలో కొలువుల జాతర (Telangana Jobs) మొదలైంది. 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే వరుసగా ఇందుకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేయనున్నారు అధికారులు. అయితే అత్యధికంగా పోటీ ఉండే జాబ్స్ లలో గ్రూప్ 2 ఉద్యోగాలు ఒకటి. అయితే గ్రూప్ 2 ఖాళీలు కేవలం 582 మాత్రమే ఉన్నాయి. వందల సంఖ్యలో ఉన్న ఈ ఉద్యోగాలను సాధించడానికి లక్షలాది మంది అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ సారి 5 నుంచి 10 లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే చాలా మంది అభ్యర్థులు సిలబస్, పరీక్షా విధానంపై సరైన అవగాహన లేక సరిగా ప్రిపేర్ కాలేకపోతుంటారు. అలాంటి వారి కోసం న్యూస్18 తెలుగు ఎప్పటికప్పుడు సిలబస్, పరీక్షా విధానం, టిప్స్ ను అందిస్తోంది.
గ్రూప్ 2 ఎగ్జామ్ లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి..

ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. మొత్తం 600 మార్కులకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుంది. మొత్తం 675 మార్కులకు నిర్వహించే ఈ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతీ పేపర్ కు 2.30 గంటల సమయం ఉంటుంది. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
TSPSC FAQs: జాబ్ నోటిఫికేషన్లపై సందేహాలున్నాయా? టీఎస్‌పీఎస్‌సీ సమాధానాలివే

గ్రూప్ I, గ్రూప్ II ప్రిలిమ్స్, గ్రూప్ III, గ్రూప్ IV సర్వీసెస్​లో పేపర్ I జనరల్ స్టడీస్​ అండ్​ జనరల్ ఎబిలిటీస్​ సిలబస్​ అన్నింటికీ కామన్​గా ఉంటుంది. అయితే సర్వీస్ స్థాయిని బట్టి సబ్జెక్ట్ వెయిటేజీ మారుతుంది. ఉదాహరణకి – తెలంగాణ ఏర్పాటుకు గ్రూప్ I, గ్రూప్ IIలో 150 మార్కులు కేటాయించారు. అయితే, గ్రూప్ IIIలో దీనికి 50 మార్కుల వెయిటేజీ మాత్రమే ఉంటుంది. గ్రూప్ IV పేపర్ Iలో జనరల్​ స్టడీస్​కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, State Government Jobs, Telangana government jobs, TSPSC, Tspsc jobs

Samantha: మరోసారి రుజువైన సమంత రేంజ్.. ఇండియాస్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ సామ్
Guava: ఈ సమస్యలు ఉన్న వాళ్లు జామపండుకు దూరంగా ఉండాలా ?.. ఎందుకంటే..
మరింత రసవత్తరంగా 2024 టి20 ప్రపంచకప్.. కొత్త ఫార్మాట్ రూల్స్ ఇవే
LIVE TV
NETWORK 18 SITES

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *