TV9 Telugu: తెలుగు మీడియాలో టీవీ9 సంచలనం.. 19 అవార్డులు కైవసం – TV9 Telugu

|
Jun 11, 2022 | 3:43 PM

News Television Awards 2022: తెలుగు మీడియాలో టీవీ9 మరో మైలురాయి అందుకుంది. అన్ని విభాగాల్లో టీవీ9 తెలుగే బెస్ట్ అని మరోసారి నిరూపించింది. బెస్ట్ రిపోర్టింగ్.. బెస్ట్ గ్రాఫిక్స్.. బెస్ట్ డిబెట్.. బెస్ట్ యాంకరింగ్.. బెస్ట్ ప్యాకేజింగ్.. బెస్ట్ ప్రోగ్రామింగ్.. బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఎవరూ పోటీ రాలేరని నిరూపించింది. ఎందులోనైనా మేము అడుగుపెట్టనంతవరకే..వన్స్ టీవీ9 స్టెప్‌ ఇన్.. రికార్డుల మోతే.. అన్నట్టుగా సాగింది న్యూస్ టెలివిజన్ (NT) అవార్డులు-2022 ప్రజెంటేషన్. న్యూస్‌లో ఫిల్టర్లుండవ్.. అందుకే అవార్డులు.. మీ అందరి రివార్డులతో టీవీ9 మీడియా రూలర్‌గా ఆవిర్భవించింది.. మెరుగైన సమాజం కోసమే మా తపన.. మా నిరంతర శ్రమ. 19 ఏళ్ల ప్రస్థానంలో మీరు ప్రశంసించని రోజు లేదు.. మీ అభినందనలు అందుకోని ప్రోగ్రామ్ లేదు. వార్తంటే నిజం. .ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక మీడియా టీవీ9. అందుకు దక్కిన ఫలితమే నేడీ అవార్డ్స్. కరోనా కాలంలో బాధితుల ఆవేదనను మీ ముందుంచాం.తప్పు చేసే వాళ్ల తాట తీసేలా ప్రశ్నించాం.పార్టీల జెండాలను మోసే కథలకు దూరంగా ఉన్నాం.ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో మీకు దగ్గరయ్యాం. మా ప్రయాణంలో ఒడుదొడుకులు ఎదురైనా ఏనాడు బెదరలేదు. ఎవరికీ తలవంచలేదు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ మన చానల్ టీవీ9 తెలుగూ..మా స్థానం మీ మనస్సూ..

సత్తా చాటిన టీవీ9 నెట్ వర్క్..

మీడియా ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకమైన NT అవార్డుల్లో సింహభాగాన్ని టీవీ9 నెట్ వర్క్ కైవసం చేసుకుంది. టీవీ9 తెలుగు ఏకంగా 19 కేటగిరిల్లో అవార్డులు గెల్చుకోగా, హిందీ న్యూస్ ఛానెల్ టీవీ9 భారత్ వర్ష్ 6 అవార్డులు, టీవీ9 బంగ్లా 14 అవార్డులు, టీవీ9 మరాఠీ 7 అవార్డులు సొంతం చేసుకున్నాయి. టీవీ9 నెట్ వర్క్ మొత్తం 46 అవార్డులను సాధించుకుని దేశ మీడియా రంగంలో మరోసారి తన సత్తాను నిరూపించుకుంది.

18 ఏళ్ల ప్రస్థానంలో..

18 సంవత్సరాల క్రితం తెలుగు ప్రజలకు ‘మెరుగైన సమాజం’ అనే నినాదం పరిచయమైంది . నినాదం కాదు విధానం కావాలి అని నిరంతర వార్తలతో మొదలైంది టీవీ 9 ప్రస్థానం. వార్తలంటే ఇలా ఉండాలి , న్యూస్ ప్రజెంట్‌ అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి అని ఎలక్ట్రానిక్ జర్నలిజం కి సరైన నిర్వచనం చెప్పింది టీవీ 9. నిష్ఫక్షపాతమైన వార్తల కోసం టీవీ 9.. బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతున్నా కెమెరా పెట్టగలిగే దైర్యం టీవీ 9.. స్టింగ్ ఆపరేషన్లు చేసి లంచాల పని పట్టిన ప్రజాపక్షం టీవీ9. అధికారిక కేంద్రాలను కూడా నిలదీసిన పవర్‌ఫుల్‌ వాయిస్ టీవీ 9. ప్రలోభాలకు లొంగని ప్రతిభ తో 24 గంటలు సామాన్యుడి పక్షాన ప్రశ్నిస్తుంది కాబట్టే న్యూస్ లీడర్ అయింది. ఇండియాస్ నంబర్ వన్ న్యూస్ నెటవర్క్ గా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , గుజరాత్, కర్ణాటక, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, ఇలా ప్రతి భాషకి దగ్గరై ఆత్మీయ ఛానల్ గా మారింది. ఎప్పటికప్పుడు సమాజాన్ని చైతన్యపరిచి పారాహుషార్ అనే ప్రజల ఊపిరి టీవీ 9 .

లాభాపేక్ష రహితంగా దాదాపు 30 సామాజిక అంశాలపై గళమెత్తి ప్రశ్నిస్తున్న ఏకైక ఛానెల్ టీవీ 9. సాధారణమైన వ్యక్తి చేతిలో పదునైన ఆయుధం లా మారి నిలదీసే ధైర్యం ఇచ్చింది టీవీ9. మెరుగైన సమాజమనే ఒకే సిద్ధాంతంతో ఒక్క అడుగుతో మొదలైన టీవీ 9 నేడు మిలియన్ మార్చ్ లా కోట్లాది ప్రజల గుండె చప్పుడు గా మారింది. టీవీ 9 అంటే వార్తలలో నిజం, సమన్వయం, ధైర్యం, తప్పును నిలబెట్టి నిలదీసే తత్వం. మూఢ నమ్మకాలను, కుల రాజకీయాలను సమూలంగా ఎండగట్టింది టీవీ9 . సామాన్యుల నిత్యవసరాల నుంచి.. పెద్దవాళ్ళ మాఫియా దందాలా దాకా ప్రతి ఒక్క దానిని కన్నార్పకుండా చూస్తూ నిజాలను నిగ్గు తేల్చడమే టీవీ9 ఉద్దేశం.18 సంవత్సరాల ప్రయాణం లో టీవీ 9 నేషనల్ , రీజినల్ , సేన్సేషనల్ అవార్డ్స్ ని ఎన్నో గెలిచింది . ఎవరూ పోటీ పడలేనంత ఖచ్చితత్వం టీవీ9. తరాలు మారినా చెక్కు చెదరని నమ్మకం టీవీ9 .

డిజిటల్ లోనూ నంబర్ వన్..

ఇప్పటికే న్యూస్ ఛానల్ పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీవీ9 తెలుగు.. డిజిటల్ మీడియాలో తనకు తిరుగులేదని నిరూపించుకుంటోంది. అనతి కాలంలోకే అంచలంచలుగా ఎదిగి టీవీ9 తెలుగు వెబ్‌సైట్ తెలుగు డిజిటల్ మార్కెట్‌లో నంబర్ 1 ( న్యూస్ వెబ్‌సైట్ల పరంగా అత్యన్నత ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ Comscore Rankings లో) స్థానంలో నిలిచింది. మెరుగైన సమాజం కోసం నిత్యం తపిస్తున్న టీవీ9 తెలుగు ఛానల్ వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారని చెప్పడానికి ఇదో ఉదాహారణ. వార్తలో వాయు వేగం.. అంతకుమించిన ఖచ్చితత్వం.. సమాజం సమస్యలను ఎటువంటి బెరుకు లేకండా ప్రజెంట్ చేయడం వంటివి టీవీ9 తెలుగును వరుసగా ఆరు మాసాల పాటు అగ్రస్థానంలో నిలబెట్టాయి. నంబర్ 1 గా ఉండటం టీవీ9 తెలుగు బర్త్ రైట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది పనీపాట లేని వాళ్లు మూకలుగా ఏర్పడి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం మళ్లీ టీవీ9కే పట్టం కట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *